May 15, 2009

రస్సెల్ నుంచి ఓ రెండు మంచి ముక్కలు

చీమలు గడ్డుకాలానికి గింజలు పోగుపెట్టినట్టు నేనీ మధ్య పొలోమంటూ పోగుబెడుతున్న పుస్తకాల్లో బెట్రాండ్ రస్సెల్ "హిస్టరీ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ" ఒకటి. చదివి దాని ఉనికికో అర్థం కల్పిస్తానా, లేక చాలా పుస్తకాల్లాగా అలమారలోనే మగ్గబెడతానా అన్నది కాలం చెప్పాలి. పుస్తకం కొన్న సందర్భాన్ని పురస్కరించుకుని రస్సెల్ గురించి గూగులిస్తుంటే 1959లో బిబిసి తరపున జాన్ ఫ్రీమన్ చేసిన ఇంటర్వూ ఒకటి కనిపించింది. (యూట్యూబ్‌లో మూడు భాగాలుగా దొరుకుతుంది.) ఈ ఇంటర్వూలో ముగింపు వాక్యాలు బాగా నచ్చాయి. అడిగిన ప్రశ్న ఇది:

John Freeman: One last question. Suppose, Lord Russell, this film were to be looked at by our descendants, like the dead sea scroll, in a thousand years time, what would you think is worth telling that generation about the life you've lived and the lessons you've learnt from it?Russell: I should like to say two things, one intellectual, and one moral. The intellecutal thing I should want to say to them is this: when you are studying any matter, or considering any philosophy, ask youself only 'what are the facts?' and 'what is the truths that the facts bear out?' Never let yourself be diverted either by what you wish to believe, or by what you think would have benefited social effects if it were believed. But look only and solely at 'what are the facts?’. That is the intellectual thing that I should wish to say.

The moral thing I should wish to say to them is really simple. I should say, love is wise, hatred is foolish. In this world, which is getting more and more closely interconnected, we have to learn to tolerate each other; we have to learn to put up with the fact that some people say things we don't like. We can only live together in that way. If we are to live together and not die together, we must learn the kind of charity and the kind of tolerance, which is absolutely vital to the continuation of human life on this planet.

పుస్తకాలకు (ముఖ్యంగా ఆయన పుస్తకాలకు) అన్వయించుకోవాల్సిన మొదటి సందేశం సులభమే. జీవితానికి అన్వయించుకోవాల్సిన రెండో సందేశమే చాలా కష్టం. అన్వయించుకుని అనుసరించగలనా, లేక బెట్రాండ్ రస్సెల్‌ లాగా ముసలి వాణ్ణయ్యాక, జీవితాన్నే మూల్యంగా చెల్లించి నేర్చుకున్న పాఠంగా నెమరు వేసుకుంటానా? మళ్ళీ కాలమే చెప్పాలి.

నిన్నటికి నిన్న "సెవెన్"లో మోర్గాన్ ఫ్రీమాన్ పాత్ర ఉవాచ ఇది:

"I mean, it's easier to lose yourself in drugs than it is to cope with life, it's easier to steal what you want to earn it, it's easier to beat a child than it is to raise it... hell, love costs, it takes effort, and work."

నిజమే, ద్వేషం సులభం. ద్వేషానికి మనల్ని మనం వదిలేసుకోవడం చాలా సులభం. మొత్తంగా ప్రపంచాన్ని విదిలించేసుకోవడం ఇంకా సులభం. కానీ ప్రేమ కష్టమైన పని. అలాగే రస్సెల్ చెప్పినట్టు, ప్రేమ తెలివైన పని. I hope I can pull it off.

5 comments:

 1. రస్సెల్స్ రాసిన marriage and morals కోసం నేను కొన్ని సంవత్సరాలుగా వెతుకుతున్నాను. ఎక్కడైనా దొరికే అవకాశం ఉందా?

  ReplyDelete
 2. పంజాగుట్ట "హిమాలయా"లో "ఫిలాసఫీ" సెక్షన్‌లో రస్సెల్ పుస్తకాలు కొన్ని వున్నాయి. అందులో మీరన్న పుస్తకం వుందో లేదో నాకు తెలీదు. నేను గతంలో "హిస్టరీ ఆఫ్ వెస్ట్రన్ ఫిలాసఫీ" కోసం వెళ్తే అది లేదు; వాళ్ళతో చెప్తే, మొన్నే మళ్ళీ తెచ్చారు. కాబట్టి పుస్తకం లేకపోయినా మీరు వాళ్ళ దృష్టికి తెస్తే తెప్పిస్తారేమో. ప్రయత్నించండి. వాల్డెన్‌లో కూడా కొన్ని చూశాను.

  ReplyDelete
 3. హైదరాబాద్, బెంగుళూరులోని అన్ని పుస్తకాల షాపులూ అయిపోయాయి. ఇంతవరకూ నా చేత చిక్కలేదు. వాళ్ళకు ఆర్డర్ ఇవ్వమని చెప్పి నా ఫోన్ నెంబర్ ఇచ్చొచ్చాను. ఇంతవరకూ ఎక్కడినుంచీ ఒక ఫోన్ పిలుపు రాలేదు.

  ReplyDelete
 4. I bought this book, "marriage and morals" in Bangalore but missed it somewhere during movements :(

  ReplyDelete
 5. A new publication of this book is available in bookshops now. If you are in Hyderabad, I saw an old copy of it in Best Books, Lakdikapool:

  http://loveforletters.blogspot.com/2011/04/blog-post_16.html

  ReplyDelete