May 2, 2009

Reckless exhilaration


నా జీవితం నీతో ఎంతగా మెలిపడిపోయి ఉందంటే, 

ఉత్తప్పుడు నేనెంత ఒక్కడినేనని విర్రవీగినా,

విర్ర వీగి విర్ర వీగి

విరిగి క్రిందపడినపుడు మాత్రం

ఠంచనుగా నా పక్కనుంటావు.

నేను ఎప్పుడూ ఏమీ ఇవ్వకపోయినా

అప్పుడప్పుడూ కనీసం ఉన్నావనే గుర్తించకపోయినా

ఏ జన్మలో నాకు బాకీ పడ్డావో పాపం

ప్రేమ యిస్తూనే వుంటావు.

ఎగరనివ్వని సంకెలవనుకుంటానో క్షణంలో

మరుక్షణం సేప్టీనెట్‌లా నా పతనాన్ని ఆపుతావు.

అమ్మవి, అందానివి, నా ఆద్యంతానివి —

ఐ లవ్ యూనే!


1 comment:

  1. హ్మ్.. "బాగుంది. బాగా రాసారు. అబ్బో.. ఈ పదం బాగా వాడారు." ఇలాంటివి చెప్తే సూర్యుడికి దివిటీ పట్టినట్టుంటుంది. నా లేమి ని,నా కరువుని చూపించినట్టుంటుంది. ఇంత మంచి చోటు ఇన్నేళ్ళూ ఎలా మిస్ అయ్యానబ్బా! ఎంత పని పెట్టారో నాకు! హాయి గా చదువుకుపోతాను. thank you! :)

    ReplyDelete