June 4, 2009

ఇంకో హోప్‌లెస్ నోస్టాల్జియా :-(

నాకు ఊహ వచ్చీరాకనే, తొమ్మిదో తరగతి చదువుతుండగా, ఈయన భూమ్మీద పని ముగించుకుని వెళ్ళిపోయాడు. తెర మీద నటుణ్ణే తప్ప తెరవెనుక వ్యక్తిని పెద్దగా చూసిందెన్నడూ లేదు. ఇప్పుడీ వీడియో చూస్తే అనిపిస్తోంది. నేను ఇలాంటి ముఖ్యమంత్రిని మిస్సవుతున్నాను. ఇంత స్వఛ్ఛమైన ఉచ్ఛారణతో ("విగ్నానం", "కృతగ్నత"లు దక్క!) ఈ మాత్రం ధాటీగా తెలుగు మాట్లాడగలిగిన ముఖ్యమంత్రి మళ్ళీ నా జన్మకి కనిపించడేమో. ఉపన్యాసం మొత్తంలో రెండే ఆంగ్ల పదాలున్నాయి (గవర్నరు, చీఫ్‌మినిస్టరు). కొన్నిచోట్ల వాక్యాలు మొదలైంది ఓ పోకడలో మొదలై ముగియడం మరో పోకడలో ముగిసినా; మాటలన్నీ అంత అలవోకగా, మనసుకీ స్వరానికీ మధ్య ఏ అడ్డంకీలేని వెల్లువగా ప్రవహించడం మాత్రం వినముచ్చటగా వుంది. (అసలే మాట్లాడే వాళ్ళంటే చచ్చే ఇష్టం, మనకు అబ్బని విద్యాయె!)

video

2 comments:

  1. సమస్యంతా ఆ 'విగ్నానం' 'కృతగ్నత' దగ్గరే వచ్చేది.. అప్పటివరకు రేడియోలో సీరియస్ గా ఉపన్యాసం విన్తున్నవాళ్ళం కాస్తా ఈ పదాలు రాగానే వాటిగురించి మాతాడుకోడం మొదలు పెట్టేవాళ్ళం.. అసలు విషయం గాలికొదిలేసి... మీరన్నట్టు ఇప్పుడు ఈమాత్రం స్పష్టంగా మాట్లాడే వారే అరుదైపోతున్నారు...

    ReplyDelete
  2. కృతఙ్ఞతలు.. ఒక మంచి వీడియో క్లిప్పింగ్ చూపించినందుకు.. నాకూ ఆ మహానుభావుడిని ప్రత్యక్షం గా చూడాలన్న కోరిక తీరలేదు. సినిమాలలోనూ, టీవీలలోనూ చూడడం తప్ప. స్పష్టమైన వుచ్చారణ... ఒక సారి దానవీర శూర కర్ణలో కర్ణుడికి రాజ్యం ఇచ్చే సందర్భం గుర్తు చేసుకోండి. అంత సంక్లిష్టమైన సమాసాలు కూడా ఒకే టేక్ లో చెప్పారట.

    ReplyDelete