July 18, 2009

సిటీ లైట్స్


చార్లీ చాప్లిన్ "సిటీ లైట్స్" నిన్ననే మొదటిసారి చూసాను. చాలా నచ్చింది. ముఖ్యంగా ముగింపు దగ్గరకొచ్చేసరికి గుండె గొంతులోకి వచ్చేసింది. ఇక అక్కణ్ణించీ దాన్ని లోపలికీ దిగమింగలేక, బయటకీ కక్కలేక ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. ఆ పూలమ్మాయి "I have made a conquest" అనేసరికైతే ఇక తట్టుకోలేక బేర్ మన్నాను. చాప్లిన్ ఇంత ఏడిపించగలడనుకోలేదు. నా వరకూ ఇది చాప్లిన్ సినిమాల్లో "మోడ్రన్‌ టైమ్స్" కన్నా, "గ్రేట్ డిటెక్టర్" కన్నా కూడా గొప్పది. నగరంలో ఓ విగ్రహావిష్కరణ సభతో సినిమా ప్రారంభమవుతుంది. ఉపన్యాసాల తర్వాత పురప్రముఖులు విగ్రహాల మీద కప్పిన గుడ్డ తీయగానే, ఓ విగ్రహం వళ్ళో మునగదీసి పడుకుని కనిపిస్తాడు చాప్లిన్. అది మొదలు, సినిమాలో ఎక్కడా ఒక్క క్షణం కూడా మందకొడితనం వుండదు. చూసి తీరాలి. చక్కగా చెక్కిన వజ్రాన్ని మొహం ముందు పట్టుకుని అది వెదజల్లే కాంతుల్లో తడుస్తున్నట్టుంటుంది.

తీసే సినిమా దృశ్యాల, సన్నివేశాల సమాహారంగా మాత్రమే మిగలిపోకుండా దానికో ఆత్మని అద్దడం కొంతమంది దర్శకులకే చేతనౌతుంది. ఆ సత్తా వున్న వాళ్ళకి భారీ బడ్జెట్లూ వినూత్నమైన టెక్నాలజీలు అవసరం లేదు. మిలియన్లు ఖర్చు పెట్టి తీసిన "టైటానిక్" ఏ మాత్రం అనుభూతి మిగల్చగలదో, కనీసం సంభాషణలు కూడా లేని ఈ నలుపు తెలుపు మూకీ చిత్రమూ అంతకుమించిన అనుభూతిని ఇవ్వగలదు. "సిటీ లైట్స్"ను నా ఆల్‌టైమ్ ఫేవరెట్ చిత్రాల జాబితాలో చేర్చేసుకున్నాను.
.

4 comments:

  1. Man, why do you think so strikingly similar to the way I do :)

    Well, if it comes down to comparing, I am more vain, more stupid and more idiotic than you :)


    Well, the point is - I love this movie too!!!

    ReplyDelete
  2. "చక్కగా చెక్కిన వజ్రాన్ని మొహం ముందు పట్టుకుని అది వెదజల్లే కాంతుల్లో తడుస్తున్నట్టుంటుంది." ...యెంత చక్కగా చెప్పారండి..

    ReplyDelete
  3. i too like city lights.

    its wonderful movie.

    did you see the kid and gold rush?

    i too liked the lines pointed in murali's comment

    ReplyDelete
  4. బాబా గారూ,

    "ద కిడ్", "గోల్డ్ రష్", "సర్కస్"... దాదాపు అన్నీ చూసాను. "ద కిడ్" బాగుంటుంది.

    ReplyDelete