July 9, 2009

Goosebumps all over :-)

అనిశ్చితమైన భవిష్యత్ చిత్రం హఠాత్తుగా ఘనీభవించి అరచేతిలో ప్రత్యక్షమైతే పులకలు తేలవా మరి వళ్ళంతా. నిజంగా నిన్న రాత్రి ఇంటికెళ్ళగానే నా తొలి ప్రతిస్పందన ఇదే. కొరియర్ కవర్లో ఒద్దికగా ఇమిడి మూడు నబొకొవ్ పుస్తకాలు:

King, Queen, Knave

Pnin

The Gift

ఈ చివరిది నిజంగా పెద్ద బహుమానమే. ఇక మూడు కలిస్తే, ఓపలేనంత పెద్ద బహుమానం. నబొకొవ్ పుస్తకాలు చచ్చేలోగా అన్నీ చదివితీరతానని తెలుసు. కానీ ఎంతలేదన్నా కాస్త అనిశ్చితి ఏ మూలో వుండేది. ఎందుకంటే ఆయన పుస్తకాలు ఇక్కడ దొరికేది తక్కువ. ఇప్పుడు వీటిని చూడగానే నమ్మకం కుదిరింది. ఇవి చాలవన్నట్టు మూడు అద్భుతమైన డాక్యుమెంటరీలు. ఒకటి కాఫ్కా గురించి, రెండు ప్రోస్ట్ గురించీ. కాఫ్కా నడిచిన ప్రాగ్ వీధుల్లోను, అతను పని చేసిన కార్మిక భీమా ఆఫీసులోనూ కెమెరా కళ్ళతో తిరగడం, ట్రయల్ నవలను నాటకీకరించగా చూడటం, ప్రోస్ట్ నవల "ఇన్ సెర్చ్ ఆఫె లాస్ట్ టైమ్"కు ఆయువు పట్టైన ఇలియెర్స్ (కోంబ్రె) పట్టణాన్ని చూడటం... ఇవి నా వరకూ చాలా విలువైన అనుభవాలు. చిన్నప్పుడోసారి అమ్మ వేసవి సెలవల్లో మా కాలక్షేపానికని యండమూరివి మొత్తం ముప్ఫై నవల్లదాకా ఒకేసారి కొని తెచ్చేసింది. ఆ ఆనందం ఎవరూ నేనైతే గానీ ఊహించలేరు. మళ్ళీ ఆ మాదిరి ఆనందమే ఇవాళ. ఇప్పుడు వీటి చేరికతో నా లైబ్రరీ నా దిష్టే తగిలేంత ముచ్చటేసుకొస్తుంది. థాంక్యూ విజయ్!

4 comments:

  1. cool. Nice to have such nice friends, no? :)

    ReplyDelete
  2. అభినందనలు..

    ReplyDelete
  3. Anonymous4:56 PM

    Hi,

    Can you please give the names of those 3 documentaries?

    ReplyDelete
  4. Those are actually 4 documentaries, on 3 writers.

    Marcel Proust:

    1) One is from a series called “The Modern World: Ten Great Writers”. Title: “Marcel Proust’s A La Recherche Du Temps Perdu” (French title of Marcel Proust’s magnum opus: In Search of a Lost Time.) Main focus is on the novel, and discusses Proust’s life in context of it.

    2) Another one is called “Marcel Proust: A writer’s Life”. This is more interesting to me than the above one. Main focus is on writer’s life. Lots of cotemporary photos, and footage. In all of these, this is the one I liked very much. (A Wolfe/ Carter Production)

    J.D Salinger:

    Title is: “J.D. Salinger Doesn’t Want to Talk”. It’s more about the enigma of Salinger than about his work.

    Franz Kafka:

    It too is a part of the above series “The Modern World: Ten Great Writers”. Discusses Kafka’s life in the context of his novel “The Trail”. Somewhat superficial.

    ReplyDelete