July 7, 2009

In defense of a "soul trampled under"కాఫ్కా మీద మూతివిరుపు విమర్శలు అరుదుగా కనిపిస్తాయి. దీనికి ఒక కారణం కాఫ్కా తన రచనల్లో చేసిచూపింది అతని ముందూ అతని తర్వాతా ఎవరూ చేయలేకపోవడం కాగా (జాయిస్, కాఫ్కాలిద్దరూ తమ ప్లేట్లను పూర్తిగా నాకేసిన పిల్లుల్లాంటి వాళ్ళంటాడు హెన్రీ గ్రీన్), మరొక కారణం జీవించివున్న కాలంలో అతనెప్పుడూ తన రచనలకు సమకాలీన సాహితీ వాతావరణంలో చోటు కల్పించేందుకు పూనుకుని ప్రయత్నించకపోవడం. అతని అర్థాంతరపు మరణం వల్లనైతేనేం, చనిపోయాకా తన రచనల్ని కాల్చేయమన్న చివరి కోరిక వల్లనైతేనేం, అతని రచనలు విమర్శకు అందకుండా కొండెక్కి కూర్చున్నాయేమోని నాకనిపిస్తుంది. కానీ అందరూ పోన్లే పాపం అని వదిలిపెట్టేయలేదనుకుంటా. ఇందాకే విమర్శకుడు ఎడ్మండ్ విల్సన్ అభిప్రాయమొకటి చదివాను:

"Kafka is being wildly overdone. What he has left us is the half-expressed gasp of a self-doubting soul trampled under. I do not see how one can possibly take him for either a great artist or a moral guide."

ఈ ఈసడింపు మాటలు కాఫ్కాని మనిషిగా తెలుసుకున్నాకా ఎవరైనా అనేవే అని నేననుకుంటున్నాను. కానీ ఒక కళాకారుణ్ణి అంచనా వేయడానికి మనిషిగా అతన్ని తెలుసుకోవడం అవసరం కాదని నేననుకుంటాను. కాఫ్కా తన కాల్పనిక రచనల్ని మాత్రమే బయట ప్రపంచానికి వదిలి, డైరీలూ ఉత్తరాలూ తనకే అట్టేపెట్టేసుకోగలిగి వుంటే, అతని రచనలపై ఇలా, "ఓ అణగదొక్కేయబడిన, స్వీయశంకిత ఆత్మ నుండి బయల్పడిన సగం సగం రొప్పుళ్ళు" లాంటి విమర్శలు వచ్చేవా అని నా అనుమానం. డైరీల్లో అంతటా అతని స్వీయశంక కనిపిస్తూనే వుంటుంది. ఉత్తరాల్లో అయితే కాఫ్కా చాలా చిర్రెత్తిస్తాడని విన్నాను (నికొలస్ ముర్రే రాసిన జీవిత చరిత్రలో). అతన్ని "మోరల్ గైడ్"గా తీసుకోవడం ఆత్మహత్యా సదృశం అని ఒప్పుకుంటాను. (అతనా విషయం మనకన్నా ముందే ఒప్పుకునుండేవాడు.) కానీ ghoulish నాలికల్తో ఆయన డైరీలపైనా ఉత్తరాలపైనా పడి, బయటి ప్రపంచపు తీర్పుల కోసం ఏమాత్రం ఉద్దేశించబడని వాటిలోని వ్యక్తిగత ప్రపంచాన్ని ఆసరాగా తీసుకుని, కాఫ్కాని గొప్ప కళాకారుడు కాడు పొమ్మంటే నేను ఒప్పుకోను. అయినా కళాకారుల్ని అంచనా కట్టే విషయంలో విమర్శకుల్ని లైట్ తీస్కోవాలనుకుంటా. ఇది నేనటం లేదు. ఓ విమర్శకుడే ఒప్పుకుంటున్నాడు. మొన్న అల్ఫ్రెడ్ కజిన్ ఇంటర్వూ ఒకటి చదివాను. చివర్లో ఆయనన్న ఒక మాట నచ్చింది. స్వయానా తాను విమర్శకుడైవుండీ, ఒక కళాకారుణ్ణి అంచనాకట్టడంలో విమర్శకుల కన్నా తోటి కళాకారులకే అగ్రతాంబూలమియ్యాలని చెప్తున్నాడు:

"Critics always talk as if they understand works perfectly and they can always criticize the perfect. But, in point of fact, they don't. They make remarks that never come close to what a work of art is about. No critic ever knows as much about a work of art as another artist."

కాబట్టి ఎడ్మండ్ విల్సన్‌ని లైట్ తీస్కోచ్చు. కాఫ్కాకి బోర్హెస్, బెకెట్, నబొకొవ్, హెన్రీ గ్రీన్ లాంటి తోటి కళాకారుల ప్రాణం పెట్టే తోడు వుంది. నబొకొవ్ రష్యన్ సాహితీ విభాగపు ఆచార్యునిగా కోర్నెల్ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నప్పుడు అక్కడి విద్యార్థులకి కాఫ్కాని పరిచయం చేస్తూ, రిల్కే లాంటి కవులూ థామస్‌మన్ లాంటి నవలాకారులూ అతని ముందు మరగుజ్జులూ, ఫ్లాస్టర్ సెయింట్లూ అంటాడు:

"Such poets as Rilke or such novelists as Thomas Mann are dwarfs or plaster saints in comparison to him."

పద్నాలుగేళ్ళలోపే షేక్‌స్పియర్ మొత్తం రచనలు ఇంగ్లీషులోనూ, టాల్‌స్టాయి మొత్తం రచనలు రష్యన్‌లోనూ, ఫ్లాబర్ మొత్తం రచనలు ఫ్రెంచ్‌లోనూ చదివేసిన పాఠకుడు నబొకొవ్. తన పఠనాభిరుచుల్లో ఇష్టాల్ని ఎంత గాఢంగా వ్యక్తీకరిస్తాడో అయిష్టాల్ని కూడా అంత తీవ్రంగానే ఎండగడతాడు. చాలామంది గొప్ప రచయితలు ఆయన కంటికి ఆననే ఆనరు. దాస్తొయెవ్‌స్కీ, అల్బెర్ట్ కామూల్లాంటి వాళ్ళు కూడా ఆయన దృష్టిలో కనీసం పాసు మార్కులు పొందలేకపోయారు. ఇలాంటి నిశితమైన పాఠకుడు ఇరవయ్యో శతాబ్దపు గొప్ప రచనలేవంటే జీవితాంతం ఒకే సమాధానం వల్లించేవాడు:

"Ever since the days when such formidable mediocrities as Galsworthy, Dreiser, a person called Tagore, another called Maxim Gorky, a third called Romain Rolland, used to be accepted as geniuses, I have been perplexed and amused by fabricated notions about so-called "great books". That, for instance, Mann's asinine Death in Venice or Pasternak's melodramatic and vilely written Zhivago or Faulkner's corncobby chronicles can be considered "masterpieces," or at least what journalists call "great books," is to me an absurd delusion, as when a hypnotized person makes love to a chair. My greatest masterpieces of twentieth century prose are, in this order: Joyce's Ulysses, Kafka's Transformation, Biely's Petersburg, and the first half of Proust's fairy tale In Search of Lost Time."

ఇంతకన్నా కాఫ్కాకి మరో వత్తాసు అవసరం లేదనుకుంటా. కాఫ్కా మనిషిగా తన పట్ల తానెప్పుడూ గర్వించలేదు. మనిషిగా తనని ప్రపంచం ముందు ఎప్పుడూ నిలబెట్టుకోవాలనుకోలేదు. అసలాయన జీవితమే, నిడివి పరంగా అయితేనేం అనుభవాల పరంగా అయితేనేం, చాలా కురచనైంది కూడా. కానీ కళాకారుడిగా ఆయన విలువేంటో ఆయనకీ తెలుసు:

"My talent for portraying my dreamlike inner life has thrust all other matters into the background; my life has dwindled dreadfully, nor will it cease to dwindle."

— ఆయన ఈ విషయమై ఎన్నడూ పెద్ద బాధపడనూ పడలేదు. కాబట్టి, విమర్శకులూ పాఠకులూ కాఫ్కా జీవితం గురించి బాధపడటం మానేసి, రచనల్ని పట్టించుకున్నప్పుడు మాత్రమే ఆయన్నుంచి పూర్తి ఆనందం పొందగలుగుతారు. అవును! అలాంటి పఠనానందం గుత్తగా ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది. (ఈ "మాత్రమే"ని బోల్డ్ లెటర్స్‌లో అండర్‌లైన్‌తో చదువుకోగలరు.)

2 comments:

 1. Critics are junk. Not all, but most of them.


  True artist live the art. I know, its a cliche, but it is true. It feels so natural when he sings/writes/dances/paints. They aren't just some random meaningless acts to them, it just feels so natural!

  The critic, by definition tries to analyze things. Criticize. Compare. Explain. While doing so, he misses a point!

  The point is - true artist's tendency is expression of his innate abilities but not impressing some random critic. Artist doesn't give a damn about what a critic might think!

  From time immemorial, through the dim past of humans - the real critic has been the common man. It is logical because he doesn't miss the point.

  Critics are junk!!

  :)

  ReplyDelete