February 22, 2011

బెట్, బంగారూ!

ముంగుర్లు సర్దుకుంటూ, కూనిరాగం తీస్తూ
ప్రస్తుతంలో లేక పరాగ్గా నువ్వు నడిచిపోతున్నపుడు
దారిలోని ఉదాసీన పరిసరాలేమైనా దయతలచి —
అలవాటుగా రంగులు మారుతున్న ట్రాఫిక్ స్తంభం నుండి
మంచు బరువుకు కుంగిన కొమ్మ దాకా ఏదైనా సరే —
నా మనోనేత్రానికి కాసేపు తమ దృష్టిపథాన్ని అరువివ్వగలిగితే,
ఒకసారి నీ ఆదమరపు అందానికి జాగృతం అయినాకా అవి
ఇక నువ్వెప్పుడటు వెళ్లినా చైతన్యాన్ని విప్పార్చుకుంటాయి
.

3 comments:

  1. చాలా బాగుంది .అలవోకగా సాగిన మీ భావన ఇక మా దారులవెంట మంచుపూలతో నిండిన కొమ్మలను చూసినప్పుడల్లా గురుతుకు రావడం ఖాయం .

    ReplyDelete
  2. బాగుందండి!

    ReplyDelete
  3. బావుంది మెహెర్. "పూలు గుసగుస లాడేనని సైగ చేసేనని..." అంటారే, వాటికి మూలమిలామ్టి కుట్రలా?

    ReplyDelete