August 23, 2012

జీవితాన్ని నిశీధిగా ఎంచి, కలల మినుకులకి, రాలిపడే శకలాల పోలు ఆనందాలకి అర్రులు చాచి, బధిరుడినై, బాధితుడినై, బంధితుడినై రసావేశ మానసాన వేగితిని, శుష్క యోచనల చిక్కితి. భగ్న పుఠల పీఠిక సమస్తం నలిగిన ప్రేమాన్వేషణలేనాయే. నిర్మాల్యము తొలిగిన మానసం కఠినశిలాసదృశ్యమాయే. స్వస్థానపు జాడలు వెదుకుతు అలిసితి, అంతఃకరణ లో అనంత సౌందర్యపు ఆనవాళ్ళు కంటి, మహానంద బ్రహ్మము కలదని విశ్వసించితి. శ్వాసనిశ్వాస లయలో నిజ స్పృహ కలిగి చరింతునికపై, హృదయ పర్ణశాల లో ఆశ్రమ వాసినై తపము చేసెద అను నిత్యం.

4 comments:

  1. రవీంద్రులను గుర్తుచేసేసారు . ఎంత బాగా రాసారు !!

    ReplyDelete
  2. చాలా బాగారాసారు.

    ReplyDelete
  3. హమ్మ్... ఇలాంటివి చదివినప్పుడల్లా ఇంకాస్త రాయకుండా ఆపేసినందుకు కోపం వచ్చేస్తుందండీ!
    నా అభిప్రాయం కేవలం, 'WOWWWW!'
    :-)

    ReplyDelete
  4. విజయ గారు, పద్మార్పిత గారు, నిషిగంధ గారు, థాంక్స్ మీ చిక్కటి అభిమానానికి. ఈ రైట్ అప్ కవిగా నా వరకు ఒక కొత్త మార్పు తెచ్చింది. రవీంద్రులతో పోల్చటం ఒక కానుక. కలమో, మనమో మొరాయించినపుడు ఈ వ్యాఖ్య చూసుకుంటా. 'మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్..' రీతి వైరాగ్యం తాకిన క్షణాల ఆ అనుభవం శాశ్వతమూ కావాలని కోరుకుంటా.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.